: ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల పారిస్ పర్యటన ముగించుకొని ఈ ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరిగిన వాతావరణ సదస్సులో పాల్గొని మోదీ కీలక ప్రసంగం చేశారు. ఇవాళ పార్లమెంట్ సమావేశాలకు ఆయన హాజరయ్యే అవకాశం ఉంది. ఈ పర్యటనలో చాలా రోజుల తరువాత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండేలతో ఆయన సమావేశమయ్యారు. గతేడాది మేలో ప్రధానమంత్రిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తరువాత... ఏడాదిన్నర కాలంలోనే ఒబామా, మోదీలు భేటీ కావడం ఇది ఆరవసారి.