: చేనును మేసిన కంచె!... ఇంటర్ విద్యార్థినిపై హోంగార్డు ఈవ్ టీజింగ్
కంచె చేను మేయడమంటే ఇదేనేమో. పాఠశాలకు వెళుతున్న అమ్మాయిలను ఆకతాయిల వేధింపుల బారి నుంచి రక్షించాల్సిన ఖాకీలే భక్షకులుగా మారిపోతున్నారు. ఇంటర్ చదువుతున్న ఓ బాలికపై హోంగార్డు ఈవ్ టీజింగ్ కు పాల్పడ్డాడు. ప్రేమించమని వేధించసాగాడు. అతడి వేధింపులు మరింత ఎక్కువ కావడంతో సదరు బాలిక అతడిపై పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడు పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ లోనే అతడిపై కేసు నమోదైంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా గార్ల మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గార్ల పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా పనిచేస్తున్న భూక్యా సోమ్లా ఓ ఇంటర్ విద్యార్థినిపై ఈవ్ టీజింగ్ కు పాల్పడి బుక్కయ్యాడు.