: టీడీపీలో ‘ఆనం’ బ్రదర్స్ చేరిక రేపే... ఖరారైన ముహూర్తం
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తన సోదరుడు ఆనం వివేకానందరెడ్డితో కలిసి ఏపీలో అధికార పార్టీ టీడీపీలో చేరేందుకు దాదాపుగా రంగం సిద్ధమైపోయింది. కార్యకర్తల కోరిక మేరకు తాము టీడీపీలో చేరుతున్నట్లు కూడా ‘ఆనం’ బద్రర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీడీపీ కీలక నేతలతో వారు పలుమార్లు భేటీ అయినట్లు విశ్వసనీయ సమాచారం. రేపు ఉదయం 9 గంటలకు విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ‘ఆనం’ బ్రదర్స్ ను టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.