: వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొందాం: ఒబామా పిలుపు


‘వాతావరణ మార్పులపై సదస్సు నిర్వహించిన తొలితరం మనదే’ అని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. పారిస్ లో ఈరోజు వాతావరణ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సులో ఒబామా మాట్లాడుతూ, గత ఏడేళ్లుగా ఎన్నో వాతావరణ మార్పులను ఎదుర్కొంటున్నామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులను సమష్టిగా ఎదుర్కోవాలని ఆయన పిలుపు నిచ్చారు. రెండు వారాల పాటు జరగనున్న ఈ సదస్సు సత్ఫలితాలనిస్తుందని ఆశిస్తున్నానన్నారు. వాతావరణ మార్పుల సవాళ్లను రూపుమాపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

  • Loading...

More Telugu News