: తెలంగాణలోనూ అసహనం కనిపిస్తోంది: తమ్మినేని
మొన్నటి వరకు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అసహనం ఇప్పుడు తెలంగాణకు కూడా పాకిందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈ రాష్ట్రంలో కూడా మత అసహనం కనిపిస్తోందని, సామాజిక ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని తెలిపారు. మెదక్ లో ఈ మేరకు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఫ్యూడల్ ఆధిపత్యం ఎక్కువైందని, ఎస్సీలపై దాడులు జరిగినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని తమ్మినేని ఆరోపించారు. తెలంగాణ సెంటిమెంట్ వల్లే వరంగల్ లో టీఆర్ఎస్ కు భారీ మెజారిటీ దక్కిందని, లేకుంటే గెలవడం కష్టమేనని తమ్మినేని పేర్కొన్నారు.