: మైక్రోసాఫ్ట్ నుంచి రెండు కొత్త లూమియా స్మార్ట్ ఫోన్లు


మైక్రోసాఫ్ట్ సంస్థ రెండు కొత్త లూమియా సిరీస్ స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లో ప్రవేశపెడుతోంది. 'విండోస్ 10 మొబైల్' ఆధారంగా పనిచేసే 'లూమియా 950', 'లూమియా 950 ఎక్స్ ఎల్' పేరుతో వీటిని విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 11 నుంచి వినియోగదారులకు ఈ కొత్త ఫోన్లు అందుబాటులో ఉంటాయి. ఈ రెండు ఫోన్లతో రూ.6వేల విలువ చేసే 'మైక్రోసాఫ్ట్ డిస్ ప్లే డాక్'ను ఉచితంగా అందించనున్నారు. లూమియా 950 ధర రూ.43,699 కాగా, లూమియా 095 ఎక్స్ ఎల్ ధర 49,399గా నిర్ణయించారు. నలుపు, తెలుపు రంగులలో ఈ ఫోన్లు లభ్యమవుతాయి.

  • Loading...

More Telugu News