: పౌరసత్వ వివాదంలో రాహుల్ గాంధీకి ఊరట
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి పౌరసత్వ వివాదంలో ఊరట లభించింది. ఆయనపై దాఖలైన పిల్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బ్రిటన్ కంపెనీ లా అధికారుల ముందు తాను ఆ దేశ పౌరుడిగా పేర్కొన్నారంటూ రాహుల్ పై వ్యాజ్యం దాఖలైంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ అమితావ్ రాయ్ లతో ఏర్పాటైన ధర్మాసనం ఈవేళ దీనిపై విచారణ చేబట్టింది. ఈ సందర్భంగా, రాహుల్ బ్రిటన్ పౌరసత్వంపై పిల్ తో పాటు జతచేసిన పత్రం ప్రామాణికతను ధర్మాసనం ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో తాము తిరుగుతూ విచారణ జరపాలా? అని పిటిషనర్ ను కోర్టు నిలదీసింది. ఇది చాలా అల్పమైన వ్యాజ్యం అంటూ కొట్టివేసింది.