: 800 ఏళ్ల తర్వాత హిందూ రాజ్యం వచ్చిందని రాజ్ నాథ్ అన్నారు: ఎంపీ మహ్మద్ సలీం
దేశంలో పెరుగుతున్న మత అసహనంపై ఈ రోజు లోక్ సభలో వాడీవేడి చర్చ జరిగింది. సీపీఎం సభ్యుడు మహ్మద్ సలీం మాట్లాడుతూ, భారత్ ఫాసిస్ట్ దేశం కాదు, ప్రజాస్వామ్య దేశమని చెప్పారు. ఎవరు ఏం తింటున్నారన్నది వారివారి వ్యక్తిగత అంశమని... ఎవరు ఏం తింటున్నారో కాకుండా, ఎవరింట్లో పొయ్యి వెలిగిందో, ఎవరింట్లో వెలగలేదో అన్న విషయంపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ భావ ప్రకటన హక్కును రాజ్యాంగం కల్పించిందని చెప్పారు. అసహనంపై ప్రధాని మోదీ మాట్లాడక పోవడం దారుణమని అన్నారు. దేశంలో హిందూ వాదం ఎక్కువైందని సలీం చెప్పారు. 800 సంవత్సరాల తర్వాత దేశంలో హిందూ రాజ్యం వచ్చిందని హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలతో సభలో గందరగోళం చెలరేగింది.