: చింటూకు 14 రోజుల రిమాండ్


చిత్తూరు జిల్లా మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ హత్య కేసులో కీలక నిందితుడు చింటూ కాసేపటి క్రితం చిత్తూరు జిల్లా కోర్టులో లొంగిపోయాడు. ఈ క్రమంలో చింటూకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మరోవైపు, కోర్టు ప్రాంగణమంతా ఉద్రిక్తంగా మారింది. కఠారి మోహన్ అనుచరులు, టీడీపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు భారీ ఎత్తున కోర్టు వద్దకు చేరుకున్నారు. చింటూకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో, పోలీసులు భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు, చింటూను విచారించడానికి కోర్టు అనుమతిని పోలీసులు కోరనున్నారు.

  • Loading...

More Telugu News