: ఫోరెన్సిక్ ల్యాబ్ చెప్పేదేముంది... ఫోన్ లో మాట్లాడింది నేనే!: జెరూసలెం మత్తయ్య


ఓటుకు నోటు కేసులో ఫోన్లో మాట్లాడింది తానేనని... ఆ గొంతు తనదేనని కేసులో ముద్దాయిగా ఉన్న జెరూసలెం మత్తయ్య స్పష్టం చేశారు. 'నా గొంతు గురించి ఫోరెన్సిక్ ల్యాబ్ చెప్పేదేముంది... అది నా గొంతే అని నేనే చెబుతున్నా'నని... ఫోన్ లో మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు. ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్సీ స్టీవెన్సన్ ను కలసి తాను మాట్లాడానని కూడా చెప్పారు. విజయవాడలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు తెలంగాణ మంత్రి కేటీఆర్, ఆయన డ్రైవర్ తనను బెదిరించారని... వారి స్వరం కూడా ఫోన్ లో రికార్డయిందని... మరి వారి సంగతేంటని ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి కుట్ర జరిగిందా? లేదా? అనే విషయం తేలాలని చెప్పారు. ఈ కేసులో టి.ఏసీబీ తనపై కేసు పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు.

  • Loading...

More Telugu News