: పార్లమెంటులో మాట్లాడేందుకు అనుమతి కల్పించండి... రాష్ట్రపతికి సామాజికవేత్త భూమానంద లేఖ
పార్లమెంట్ ఉభయసభలు లోక్ సభ, రాజ్యసభలో మాట్లాడేందుకు తనకు అనుమతి కల్పించాలని ప్రముఖ సామాజిక వేత్త స్వామి భూమానంద కోరారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. ఈ విషయాన్ని ఆయనే మీడియాకు తెలిపారు. పార్లమెంటులో చట్టాల ఏర్పాటు ప్రాముఖ్యత, సభా కార్యక్రమాలకు భంగం కలిగితే అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్న అంశాలపై తాను మాట్లాడాలనుకుంటున్నట్లు ప్రణబ్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. వాటితో పాటు జాతీయ అభివృద్ధి ఎజెండాపై కూడా ప్రసంగించాలనుకుంటున్నట్టు చెప్పారు.