: గురజాడకు చంద్రబాబు నివాళి...సాహిత్యంలో వాడుక భాష గురజాడ కృషేనని వ్యాఖ్య


తెలుగు సాహిత్యంలో కొత్త ఒరవడికి నాంది పలికిన కవి గురజాడ అప్పారావుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఘన నివాళి అర్పించారు. కొద్దిసేపటి క్రితం బెజవాడలోని తన క్యాంపు కార్యాలయంలో కేబినెట్ భేటీకి ముందు అక్కడ ఏర్పాటు చేసిన గురజాడ చిత్రపటానికి పూల మాల వేసిన చంద్రబాబు దివంగత కవికి నివాళి అర్పించారు. గురజాడ శత వర్ధంతిని పురస్కరించుకుని నిన్ననే ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉత్సవాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా గురజాడ విశిష్ట శైలిని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. అప్పటిదాకా కఠిన పదబంధాలతో కూడిన తెలుగు సాహిత్యాన్ని వాడుక భాషతో గురజాడ పరుగులు పెట్టించారని కీర్తించారు. గురజాడ కృషి వల్లే నేడు తెలుగు సాహిత్యంలో వాడుక భాషను విరివిగా వినియోగిస్తున్నామని కూడా చంద్రబాబు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News