: గ్వాటెమాలా జైల్లో మరోసారి ఖైదీల మధ్య ఘర్షణ... ఆరుగురు మృతి
గ్వాటెమాలా జైల్లో మరోసారి ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురు ఖైదీలు చనిపోయారు. కొంతమందికి గాయాలయ్యాయి. పరిమితికి మించి అధికంగా ఈ జైల్లో ఖైదీలు ఉంటారు. వాస్తవానికి గ్వాటెమాలాలోని ఈ జైలు సామర్థ్యం కేవలం 600 మంది మాత్రమే. కానీ ప్రస్తుతం జైల్లో 3,092 మందిని ఉంచారు. ఈ జైళ్ల నిర్వహణ బాధ్యతను ప్రైవేటు సంస్థలు చూస్తున్నాయి. అయితే జైల్లోని మారా 18, మారా సాల్వత్రుచా గ్యాంగ్స్ మధ్య గొడవ వల్లే ఖైదీలు చనిపోయారని, పోలీసులు కూడా గాయపడ్డారని అక్కడి అంతర్గత వ్యవహారాల డిప్యూటీ మంత్రి ఎమర్ సోసా వెల్లడించారు. ఘటన విషయం తెలిసిన వెంటనే పోలీసులు, ఆర్మీ సిబ్బంది జైలు వద్ద పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు.