: మేం స్మగ్లర్లం కాదు... వ్యవసాయదారులం: గంగిరెడ్డి భార్య మాళవిక


ఎర్రచందనం అక్రమ రవాణాలో అంతర్జాతీయ స్థాయి స్మగ్లర్ గా ఎదిగిన కొల్లం గంగిరెడ్డి స్మగ్లర్ కాదట. నిఖార్సైన రైతు బిడ్డ అట. ఈ మేరకు అతడి సతీమణి మాళవిక ఇటీవల హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొంది. ‘‘మేం స్మగ్లర్లం కాదు. పక్కా వ్యవసాయదారులం. రాజకీయ కక్షలతోనే నా భర్తపై ఎర్రచందనం కేసులు పెట్టారు. ప్రాణహాని ఉన్నప్పటికీ, అధికార పార్టీ నేతలు భయపెట్టి, అలాంటిదేమీ లేదని నా భర్తతో చెప్పించారు. ఏపీలోని జైళ్లలో నా భర్తకు ముమ్మాటికీ ప్రాణహాని ఉంది. హైదరాబాదులోని జైలుకు తరలించండి’’ అంటూ ఆమె హైకోర్టుకు విన్నవించింది. ఇదివరకే తన భర్తను తెలంగాణలోని ఏ జైలుకు తరలించినా అభ్యంతరం లేదని, ఏపీ జైళ్లలో మాత్రం పెట్టవద్దని ఆమె కోరిన విషయం తెలిసిందే. పోలీసు అధికారుల నుంచి సరైన స్పందన లేని కారణంగా ఆమె నిన్న ఏకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

  • Loading...

More Telugu News