: ఆ పని మావోలు చేయలేదేమో..!: ఏపీ మంత్రి పరిటాల సునీత
విశాఖపట్నం జిల్లాలోని మన్యం పరిధిలో ఓ రేషన్ దుకాణం లూటీ కావడంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత స్పందించారు. జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న ఆమె, ఈ పని మావోలు చేసి వుండరని అభిప్రాయపడ్డారు. పేదల కోసం నిర్దేశించిన బియ్యాన్ని వారు తీసుకెళ్లరని తాను భావిస్తున్నానని, డీలర్ కు గిట్టని వారు ఎవరో మావోల పేరు చెప్పుకుని ఈ పని చేసివుండవచ్చని అనుమానిస్తున్నామని తెలిపారు. ఈ దిశగా విచారణ జరిపించాలని, ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టబోమని పరిటాల సునీత హెచ్చరించారు.