: భారీ ప్రాజెక్టులు ప్రకటించనున్న ఒబామా, మోదీ, బిల్ గేట్స్


వాతావరణ మార్పులు, భూతాపాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు, శుద్ధ ఇంధన రీసెర్చ్, డెవలప్ మెంట్ కార్యకలాపాల కోసం అమెరికా అధ్యక్షుడు ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోదీ కలసి తీసుకోనున్న నిర్ణయానికి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అండగా నిలవనున్నారు. పారిస్ లో పర్యావరణ సదస్సు నేడు జరగనుండగా, ఒబామా, మోదీలతో కలసి బిల్ గేట్స్ మీడియాతో మాట్లాడుతారని, వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను వీరు ప్రకటిస్తారని తెలుస్తోంది. గేట్స్ తో పాటు పలు అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు ఈ ప్రాజెక్టులో భాగం పంచుకుంటాయని, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల లభ్యతను సమీప భవిష్యత్తులో రెట్టింపు చేయడమే లక్ష్యమని సమాచారం. అమెరికా, ఇండియాలతో పాటు ఫ్రాన్స్, సౌత్ కొరియా, ఇండొనేషియా, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, కెనడా, నార్వే తదితర దేశాలు ఈ ప్రాజెక్టులో కలిసేందుకు ఇప్పటికే అంగీకరించాయని, మొత్తం 190 దేశాలను భాగం చేయాలన్నది తమ అభిమతమని పర్యావరణ నిపుణులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల్లో అత్యధికం గేట్స్ ఫౌండేషన్ అందించనున్నట్టు మైక్రోసాఫ్ట్ వర్గాలు తెలియజేశాయి.

  • Loading...

More Telugu News