: ప్యారిస్ చేరుకున్న మోదీ... ‘ఉగ్ర’దాడి నేపథ్యంలో భారీ భద్రత


భారత ప్రధాని నరేంద్ర మోదీ నిన్న రాత్రి 11.30 గంటలకు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ చేరుకున్నారు. వాతావరణ సదస్సులో పాల్గొనే నిమిత్తం నిన్న సాయంత్రం న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన మోదీ, రాత్రికి ప్యారిస్ లోని ఛార్లెస్ డిగాలే విమానాశ్రయంలో దిగారు. ఈ సందర్భంగా ప్యారిస్ కు బయలుదేరిన విషయంతో పాటు అక్కడికి చేరుకున్న విషయం, సదస్సులో భారత్ ప్రస్తావించబోయే అంశాలను ఆయన తన అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అంతేకాక ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాలతో భేటీ కానున్నట్లు కూడా ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే, ఐఎస్ ఉగ్రవాదులు ఇటీవల ప్యారిస్ పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల భీకర దాడుల నేపథ్యంలో ప్యారిస్ లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అదే సమయంలో వాతావరణ సదస్సులో పాలుపంచుకునేందుకు అగ్రరాజ్యం అమెరికా సహా 150 దేశాలకు పైగా ప్రతినిధులు ప్యారిస్ కు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ప్యారిస్ లో ఫ్రాన్స్ ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది.

  • Loading...

More Telugu News