: బుజ్జి బొమ్మతో ప్రిన్సెస్ ఛార్లొట్టె !
ప్రిన్స్ విలియమ్స్ దంపతుల గారాలపట్టీ, ప్రిన్సెస్ ఛార్లొట్టె తన బొమ్మతో ఆడుకుంటూ నవ్వులు చిందిస్తుండగా తల్లి కేట్స్ ఒక ఫొటో తీసింది. ఈ ఫొటోను అధికారికంగా ఆదివారం విడుదల చేశారు. కెన్సింగ్ టన్ ప్యాలెస్ లో ఈ ఫొటోను ఉంచారు. ఇంగ్లాండ్ లోని శాన్ డ్రింగ్ హమ్ లో ఛార్లొట్టె తన బొమ్మతో ఆడుకుంటుండగా తీసిన ఫొటో ఇది. కాగా, లండన్ లోని సెయింట్ మేరీస్ ఆసుపత్రిలో మే 2, 2015లో ఛార్లొట్టె జన్మించింది. ఛార్లొట్టె సోదరుడు ప్రిన్స్ జార్జి జులై 22, 2013లో జన్మించాడు.