: నా కొడుక్కి నేనెప్పుడూ సలహాలివ్వలేదు: బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్


తన కొడుకు క్రమశిక్షణ ఉన్న ఆటగాడని, సరైన సమయంలో నిర్ణయాలు తీసుకుంటాడని.. అందుకే టైగర్ ష్రాఫ్ కి ఎటువంటి సలహాలు ఇవ్వనని బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీష్రాఫ్ అన్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ‘టైగర్’ కెరీర్ లో తన పాత్రేమీ లేదని, సరైన పద్ధతిలోనే అతన్ని పెంచామని చెప్పుకొచ్చాడు. ‘టైగర్’ చదువు విషయంలోనూ తానెప్పుడూ సలహాలు ఇవ్వలేదన్నారు. అతడి కెరీర్ సాఫీగా సాగుతోందంటూ జాకీష్రాఫ్ తన కొడుకు గురించి చెప్పారు.

  • Loading...

More Telugu News