: మకావు ఓపెన్ మన సింధుదే!
అచ్చ తెలుగు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరిసింది. మకావు ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళ సింగిల్స్ విభాగంలో జరిగిన ఫైనల్స్ పోరులో విజయం సాధించింది. తుది పోరులో జపాన్ కు చెందిన క్రీడాకారిణి మిథానీపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించి భారత కీర్తి ప్రతిష్ఠలను మరింతగా పెంచింది. ఆట మూడు సెట్లు సాగినప్పటికీ, తాను గెలిచిన రెండు సెట్లలో పూర్తి ఆధిపత్యం చూపిన సింధు 21-9, 21-23, 21-14 తేడాతో గెలిచింది. మకావు ఓపెన్ టైటిల్ ను గెలుచుకోవడం సింధుకు ఇది మూడోసారి కావడం విశేషం.