: ఫేస్ బుక్ పురుష ఉద్యోగులకు శుభవార్త... నాలుగు నెలల పేటర్నిటి లీవ్!


ఫేస్ బుక్ లో పని చేస్తున్న పురుషులకు ఆ సంస్థ శుభవార్త ప్రకటించింది. తమ పురుష ఉద్యోగులకు పేటర్నటీ లీవును అమలు చేస్తున్నట్టు తెలిపింది. ఈ లీవు ప్రకారం తండ్రి అయిన వ్యక్తి శిశువు పుట్టిన ఏడాది లోపు నాలుగు నెలల పాటు సెలవు పొందవచ్చని, ఈ లీవును అవసరాన్ని బట్టి వినియోగించుకోవచ్చని సంస్థ తెలిపింది. పేరంటల్ పాలసీకి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫేస్ బుక్ తెలిపింది. పిల్లలు పుట్టినా లేక దత్తత తీసుకున్నా కూడా ఈ లీవు వర్తిస్తుందని ఈ ప్రకటన వెల్లడించింది. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులైతే పిల్లలతో గడిపే సమయం పెరగాలని అధ్యయనాలు తెలిపిన సంగతి తెలిసిందే. దానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫేస్ బుక్ హెచ్.ఆర్. ప్రకటించింది. కాగా, పేటర్నిటీ లీవులో భాగంగా రెండు నెలల లీవును ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకెర్ బర్గ్ కూడా వినియోగించుకుంటున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News