: వైఫై కన్నా వంద రెట్ల వేగంతో 'లైఫై'


వైఫై స్థానాన్ని సరికొత్త టెక్నాలజీ లైఫై ఆక్రమించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాలాన్ని వినియోగదారులకు మరింత దగ్గర చేసేందుకు పరిశోధకులు సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశారు. దీనికి లైఫై అని పేరు పెట్టారు. దీని వేగం వైఫై కంటే వంద రెట్లు అని వారు తెలిపారు. లైఫై ద్వారా హైడెఫినిషన్ సినిమాలు, వీడియో గేమ్స్, ఆల్బమ్స్ క్షణాల్లో డౌన్ లోడ్, అప్ లోడ్ చేసుకోవచ్చని వారు వెల్లడించారు. ఎల్ఈడీ లైట్లు, విజిబుల్ లైట్ కమ్యూనికేషన్ (వీఎల్ సీ) మాధ్యమంగా డేటా పని చేయడం లైఫై ప్రత్యేకత అని, ఇదే దాని బలం అని కూడా వారు చెబుతున్నారు. భవిష్యత్ లో వైఫై స్థానాన్ని లైఫై ఆక్రమించినా ఆశ్చర్యపోనక్కర్లేదని వారు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News