: వేసవి సెలవులు ముగిసేసరికి డీఎస్సీ: కడియం
2016 జూన్ లోగా డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కళాశాలలో మౌలిక వసతుల కోసం 1500 కోట్లు విడుదల చేస్తున్నట్టు చెప్పారు. కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన వెల్లడించారు. పత్తికి మద్దతు ధర కల్పించడంలో కేంద్రం విఫలమైందని ఆయన చెప్పారు. వరంగల్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ప్రతిపక్షాలకు చెంపపెట్టు లాంటిదని ఆయన వివరించారు. జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య కోసం జీవో జారీచేయలేకపోయామని చెప్పిన ఆయన, జిల్లా కలెక్టర్లకు మాత్రం ఇందుకు సంబంధించిన జీవో జారీ చేశామని ఆయన వివరించారు.