: 'రక్షించండి' అంటూ రైల్వే మంత్రికి ప్రయాణికురాలి ట్వీట్...క్షణాల్లో పోలీసులు ప్రత్యక్షం


'18030 రైల్లో ప్రయాణిస్తున్నాను...ఓ పురుష ప్రయాణికుడి వ్యవహార శైలి భయంకరంగా ఉంది. మా ట్రైన్ ముంబయ్ శివారు షిగావు స్టేషన్ దాటింది' అంటూ ఓ మహిళ రైల్వే మంత్రి సురేష్ ప్రభు ట్విట్టర్ ఖాతాకు అనుబంధంగా ట్వీట్ చేసింది. దీనిని చూసిన అధికారులు అప్రమత్తమయ్యారు. ఆమె ప్రయాణిస్తున్న ట్రైన్ తదుపరి స్టేషన్ చేరేసరికి అధికారులు, పోలీసులు నేరుగా ఆమె వద్దకు వెళ్లి ఆరాతీశారు. ఆమె ఎవరి కారణంగా భయపడుతోందో ఆ వ్యక్తిని దూరంగా మరో బోగీలోకి తీసుకెళ్లారు. వెయింటింగ్ లిస్ట్ లో ఉన్న అతని ప్రవర్తన ఇబ్బందికరంగా తోచడంతో తాను ట్వీట్ చేశానని ఆమె తెలిపారు. ప్రయాణికులకు ఎవరికైనా అత్యవసర సాయం కావాలనుకుంటే '182' నెంబర్ కు కాల్ చేయాలని తెలిపారు.

  • Loading...

More Telugu News