: నెలల తర్వాత సెక్రటేరియట్ లో చంద్రబాబు... మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు దాదాపు రెండున్నర నెలల తర్వాత హైదరాబాదులోని సచివాలయానికి వచ్చారు. ఓటుకు నోటు కేసు నేపథ్యంలో పాలనా వ్యవహారాలన్నింటినీ విజయవాడ కేంద్రంగానే పర్యవేక్షిస్తున్న చంద్రబాబు అక్కడే తనకు తాత్కాలిక వసతి గృహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారానికో, రెండు వారాలకో హైదరాబాదు వస్తున్న ఆయన ఒకటి, రెండు రోజుల్లోనే తిరిగి విజయవాడ వెళుతున్నారు. తాజాగా నిన్న రాత్రి హైదరాబాదు వచ్చిన చంద్రబాబు కొద్దిసేపటి క్రితం నేరుగా సచివాలయంకు వెళ్లారు. సెక్రటేరియట్ లోని ఎల్ బ్లాకులో తన కోసం ఏర్పాటు చేసుకున్న కార్యాలయంలో ఆయన మంత్రులు, ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. విజయవాడకు కార్యాలయాలు, ఉద్యోగుల తరలింపునకు సంబంధించి ఈ భేటీలో కీలక చర్చ జరుగుతున్నట్లు సమాచారం. దాదాపు రెండున్నర నెలల తర్వాత చంద్రబాబు సచివాలయానికి రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.

  • Loading...

More Telugu News