: ప్రకాశం జిల్లాలో మళ్లీ భూ ప్రకంపనలు... భయాందోళనల్లో ప్రజలు
మొన్న నేపాల్ లో సంభవించిన పెను భూకంపం ఏపీలోని పలు ప్రాంతాలను వణికించింది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో వరుస ప్రకంపనలు సంభవించాయి. ఏపీలో భూకంప ప్రమాదం అధికంగా పొంచి ఉన్న ప్రకాశం జిల్లాల్లోనూ నాడు భూప్రకంపనలు నమోదయ్యాయి. తాజాగా నేటి ఉదయం ఆ జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్వల్ప తీవ్రతతో కూడిన భూకంపం సంభించింది. దీని వల్ల ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. కొన్ని సెకన్ల పాటు సంభవించిన ఈ ప్రకంపనలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ప్రస్తుతం నగరంలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.