: మేనల్లుడి తలనీలాల సమర్పణకు రాలేకపోయిన మోక్షజ్ఞ... చంద్రబాబు మేనల్లుడితో కార్యక్రమం నిర్వహణ


చిన్న పిల్లలకు పుట్టు వెంట్రుకలను తీసే కార్యక్రమాన్ని వారి మేనమామలు పూర్తి చేయడం కొన్ని కుటుంబాలలో ఆనవాయతీగా వస్తుంది. నిన్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి మనవడు దేవాన్ష్ తలనీలాల సమర్పణ ఘనంగా ముగిసింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని చంద్రబాబు సొంతూరు నారావారిపల్లెకు కుటుంబాలతో కలిసి వచ్చిన చంద్రబాబు, ఆయన వియ్యంకుడు నందమూరి బాలకృష్ణలు సందడి చేశారు. నిన్న ఉదయం గ్రామంలోని చంద్రబాబు కులదైవం నాగాలమ్మ గుడిలో ఈ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. అయితే ఈ వేడుకకు తప్పనిసరిగా హాజరుకావాల్సిన బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ మాత్రం రాలేకపోయాడు. దీంతో చంద్రబాబు మేనల్లుడు కనుమూరి ఉదయ్ కుమార్ చిన్నారి దేవాన్ష్ ను తన ఒడిలో కూర్చోబెట్టుకుని పుట్టు వెంట్రుకలు తీయించారు.

  • Loading...

More Telugu News