: మరోసారి సమావేశం కావాలని నిర్ణయించాం: కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ


మరోసారి సమావేశం కావాలని తాము నిర్ణయించామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ లతో ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన భేటీ ముగిసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ భేటీలో అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు పాల్గొన్న విషయం తెలిసిందే. అరుణ్ జైట్లీ మాట్లాడుతూ, వస్తు, సేవల పన్ను సహా కీలక బిల్లుల ఆమోదంపై చర్చించినట్లు తెలిపారు. ప్రభుత్వ అభిప్రాయాన్ని కాంగ్రెస్ నేతలకు వివరించామన్నారు. కాంగ్రెస్ మూడు సూచనలు చేసిందని, ఈ అంశాలపై ప్రభుత్వం చర్చిస్తుందని జైట్లీ చెప్పారు.

  • Loading...

More Telugu News