: మన్మోహన్ సింగ్, సోనియా తో సమావేశమైన ప్రధాని మోదీ
పార్లమెంటులో బిల్లులను గట్టెక్కించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా రంగంలోకి దిగారు. రాజ్యసభలో బిల్లులకు ఆటంకాలు ఏర్పడకుండా చూసేందుకు నడుం బిగించారు. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ లతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు కూడా హాజరయ్యారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా వస్తు సేవల బిల్లు సహా పలు కీలక బిల్లులపై చర్చించనున్నారు. కాగా, తొలి రోజు సమావేశాల సందర్భంగా పలు సవరణలు చేస్తే బిల్లు ఆమోదానికి మద్దతు తెలుపుతామని రాహుల్ గాంధీ పేర్కొన్న సంగతి తెలిసిందే.