: రెండు బ్యాక్ కెమెరాలున్న కొత్త స్మార్ట్ ఫోన్
మరో కొత్త స్మార్ట్ ఫోన్ ఈ రోజు మార్కెట్లోకి వచ్చింది. రెండు బ్యాక్ కెమెరాలు ఉన్న 'కికూ క్యూ టెరా 808' అనే ఈ స్మార్ట్ ఫోన్ ను ఈ రోజు మార్కెట్ లోకి విడుదల చేశారు. ప్రముఖ సంస్థలు కూల్ పాడ్ డాజెన్, కిహూ 360 టెక్నాలజీస్ సంయుక్తంగా ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ను తయారు చేశాయి. రెండు వెనుక కెమెరాలు ఉండటం ఈ ఫోన్ ప్రత్యేకత. ఈ ఫోన్ ధర రూ.19,999గా ఉంది. కికూ క్యూ టెరా 808 ఫీచర్ల విషయాని కొస్తే... * ఆండ్రాయిడ్ 5.1 ఆపరేటింగ్ సిస్టమ్ * 16 జీబీ ఇంటర్నల్ మెమెురీ * 3 జీబీ రామ్ * 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా * రెండు బ్యాక్ కెమెరాలు (13 మెగా పిక్సెల్ రిజల్యూషన్ ) * 6 అంగుళాల టచ్ స్క్రీన్ * 2 గిగా హెడ్జ్ ప్రాసెసర్ వంటివి ఈ ఫోన్ ప్రత్యేకతలుగా ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.