: లక్ష్యాన్ని ఛేదించిన అగ్ని-1... ప్రయోగం సక్సెస్!
భారత ఆయుధ సంపత్తిలోని అగ్ని-1 క్షిపణి పరీక్ష విజయవంతమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఇది తయారైంది. భూమి ఉపరితలం నుంచి 700 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణిని ఒడిశాలోని బాలాసోర్ లోని అబ్దుల్ కలాం ద్వీపంలోని నాలుగో లాంచ్ ప్యాడ్ నుంచి అధికారులు విజయవంతంగా ప్రయోగించారు. సాధారణ పరీక్షల్లో భాగంగా ఈ క్షిపణిని పరీక్షించినట్టు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. టన్ను బరువున్న వార్ హెడ్ ను అగ్ని-1 క్షిపణి సునాయాసంగా మోసుకెళ్లగలదని, ఇది ఇప్పటికే సైన్యంలో సేవలందిస్తోందని అధికారులు వెల్లడించారు.