: చంద్రబాబుకు అండగా ఉంటాం... ప్రజా సేవ చేస్తాం: ఆనం సోదరులు
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు అండగా ఉండేందుకే తాము టీడీపీలో చేరదలిచామని ఆనం సోదరులు వెల్లడించారు. రాజధానిని నిర్మించుకునే క్రమంలో ఏపీ ఉందని... ఈ సమయంలో ప్రభుత్వానికి అందరూ సహకరించాల్సిన అవసరం ఉందని ఆనం వివేకా తెలిపారు. పదవుల కోసం తాము రాజకీయాలు చేయమని... బిడ్డల ఉజ్వల భవిష్యత్తు కోసం రాజకీయాలు చేస్తామని చెప్పారు. మరోవైపు ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ, గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజా సేవ చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.