: విభజన చట్టాన్ని హడావుడిగా రూపొందించారు: సుజనా చౌదరి
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని హడావుడిగా రూపొందించారని కేంద్ర మంత్రి సుజనా చౌదరి పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేయాలని తాము చెప్పడం లేదని, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరిగిందని తెలిపారు. విభజనపై సమగ్ర చర్చ జరగలేదని, అలాగే పార్లమెంటులో సైతం సమగ్రమైన చర్చ జరగలేదని ఆయన చెప్పారు. విభజన చట్టాన్ని హడావుడిగా రూపొందించి, హడావుడిగా ఆమోదించారని ఆయన పేర్కొన్నారు. విభజనలో ఆంధ్రప్రదేశ్ కు న్యాయం జరగలేదన్నది అందరికీ తెలిసిందేనని ఆయన చెప్పారు.