: ఏపీకి ప్రత్యేక హోదా రావాల్సిందే: వెంకయ్యనాయుడు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాల్సిందేనని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పార్లమెంట్ లో వెల్లడించారు. ఏపీకి రెవెన్యూ లోటు ఉన్నందునే హోదా కావాలని ప్రజలు కోరుతున్నారని, అలా కోరుతున్నవారిలో తాను కూడా ఉన్నానని స్పష్టం చేశారు. హోదా వస్తేనే రాష్ట్ర అభివృద్ధి త్వరితగతిన సాగుతుందని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం నీతి ఆయోగ్ పరిశీలనలో ఉందని వెల్లడించిన ఆయన, ఏపీ అభివృద్ధికి, విభజన హామీల అమలుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన పంజాబ్ వంటి రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదాను అడుగుతున్నాయని గుర్తు చేసిన ఆయన, మరెన్నో రాష్ట్రాలు అదే డిమాండ్ ను తెరపైకి తెస్తున్నాయని తెలిపారు. ఈ విషయంలో పట్టుదలకు పోకుండా, దేశ సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

  • Loading...

More Telugu News