: దేశమంతా మనల్ని చూస్తోంది... గమనించండి: వెంకయ్యనాయుడు
పార్లమెంటు సమావేశాల్లో అన్ని పార్టీల సభ్యులు బాధ్యతగా ప్రవర్తించాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. మన ప్రవర్తనను దేశం మొత్తం చూస్తోందన్న విషయాన్ని గమనించాలని హితవు పలికారు. ఈ రోజు లోక్ సభలో ఆయన మాట్లాడుతూ, మన ముందున్న సవాళ్లను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై సమగ్రంగా చర్చిద్దామని విపక్షాలను కోరారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం విపక్షాలకు తగదని... అన్ని ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానమిస్తుందని చెప్పారు. బ్రిటీష్ పాలన సమయంలోనే దేశ పునర్నిర్మాణం కోసం అంబేద్కర్ ఎంతో కృషి చేశారని... ప్రజలకు స్వేచ్ఛ అనేది చాలా ముఖ్యమని చెప్పారని తెలిపారు. అంబేద్కర్ స్ఫూర్తితో అందరం కలసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎలా ఎదుర్కోవాలనే దానిపై చర్చిద్దామని చెప్పారు.