: రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పై కేసు నమోదు


నిన్న తిరుపతి విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా మేనేజరుపై దాడిచేసిన ఘటనలో సంబంధించి కడప జిల్లా రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్‌ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సహా మరో 13 మందిపై రేణిగుంట పోలీస్‌ స్టేషనులో కేసు నమోదైంది. నిన్న మధ్యాహ్నం ప్రొటోకాల్ విషయంలో మిథున్‌ రెడ్డి ఎయిర్ ఇండియా మేనేజరు రాజశేఖర్‌ తో గొడవ పడగా, వాగ్వాదం తీవ్రస్థాయికి చేరడంతో, ఎంపీ అనుచరులు, చెవిరెడ్డి తదితరులు ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనపై పౌరవిమానయాన శాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన మేనేజర్ వారి ఆదేశాల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని, సీసీటీవీ ఫుటేజ్ లు పరిశీలిస్తున్నామని రేణిగుంట రూరల్ సీఐ సాయినాథ్ వివరించారు.

  • Loading...

More Telugu News