: ముంబయి అండర్-16 జట్టుకు సచిన్ కొడుకు ఎంపిక
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ ముంబయి అండర్ -16 జట్టుకు ఎంపికయ్యాడు. డిసెంబర్ 1 నుంచి 3 వరకు గుజరాత్ లోని బరోడాలో జరిగే విజయ్ మర్చెంట్ ట్రోఫీకి గురువారం ప్రకటించిన జట్టులో అర్జున్ టెండూల్కర్ కి స్థానం దక్కింది. ముంబయి జట్టుకు అతర్వా అంకొలేకర్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ముంబయి-బరోడా జట్ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్ ను తిలకించేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు.