: నెల్లూరులో మిస్సైల్ కలకలం
నెల్లూరు జిల్లాలో మిస్సైల్ కలకలం రేగింది. వాకాడ మండం పులింజరిపాలెం సముద్ర తీరానికి ఓ మిస్సైల్ కొట్టుకొచ్చింది. మిస్సైల్ సముద్ర తీరంలో కనబడడంతో స్థానికుల్లో ఆందోళన రేగింది. సుమారు 20 అడుగుల పొడవు, ఐదు నుంచి ఆరు టన్నుల బరువున్న భారీ మిస్సైల్ దర్శనమివ్వడంతో అంతా భయపడ్డారు. దీంతో హుటాహుటీన ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగ ప్రవేశం చేసిన అధికారులు దానిని పరిశీలిస్తున్నారు. దీనిపై ఆయుధ పరిశోధన సంస్థకు చెందిన నిపుణులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.