: అమీర్ ఖాన్ కు పరోక్షంగా చురకలంటించిన మంత్రి రాజ్ నాథ్


ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వంటి గొప్ప వ్యక్తే ఈ దేశాన్ని వీడాలన్న ఆలోచన చేయలేదంటూ పరోక్షంగా బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కి చురకలంటించారు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్. గురువారం పార్లమెంట్ లో ఆయన ప్రసంగిస్తూ, నాటి రాజకీయ, సామాజిక అంశాల దృష్ట్యా అంబేద్కర్ ఎన్నో విమర్శలతో పాటు అవమానాలను ఎదుర్కొన్నారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేశాన్ని వదిలి పెట్టాలన్న ఆలోచన ఆయన ఎన్నడూ చేయలేదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలంటూ పరోక్షంగా అమీర్ ఖాన్ కు ఆయన మొట్టికాయలు వేశారు.

  • Loading...

More Telugu News