: పాకిస్థాన్ తరహాలో చంద్రబాబు ఫత్వా జారీ చేస్తున్నారు: వాసిరెడ్డి పద్మ


పాకిస్థాన్ లో మత పెద్దల తరహాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫత్వా జారీ చేస్తున్నారని కాంగ్రెస్ నేత వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, రాజ్యాంగ ఆమోద దినోత్సవం రోజున, రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అవమానించే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆరోపించారు. జర్నలిజాన్ని పెయిడ్ జర్నలిజం స్థాయికి దిగజార్చిన చంద్రబాబు, ఒక పత్రికను చూడవద్దని ప్రజలకు చెబుతున్నారని ఆమె మండిపడ్డారు. టీడీపీ నేతల ఇసుక మాఫియాపై అన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయని, సాక్షాత్తూ హైకోర్టే చివాట్లు పెట్టిందని ఆమె గుర్తుచేశారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించడం సాక్షి దినపత్రిక చేసిన తప్పా? అని ఆమె ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News