: రేపు పాక్షిక చంద్ర గ్రహణం
ఖగోళ పరిశీలకులకు మంచి అవకాశం! రేపు చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాది ఏర్పడనున్న మూడు చంద్ర గ్రహణాల్లో ఇది మొదటిది. అయితే, ఇది అత్యంత స్వల్ప సమయం మాత్రమే కనువిందు చేయనుందని నాసా అంటోంది. దాదాపు 27 నిమిషాల పాటు ఈ పాక్షిక గ్రహణం ఉంటుంది. ఈ చంద్ర గ్రహణం రేపు రాత్రి 11.30 గం. లకు ప్రారంభమై శుక్రవారం వేకువ జామున 3.43 గం. వరకు కొనసాగుతుందని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా తెలిపింది.