: స్పైస్ జెట్ విమానానికి సాంకేతిక లోపం... శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల పడిగాపులు
హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాదు నుంచి బెంగళూరు వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం సాంకేతిక లోపం కారణంగా విమానాశ్రయంలో నిలిచిపోయింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని చెప్పిన స్పైస్ జెట్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మాత్రం చేయలేదు. దీంతో నేటి ఉదయం నుంచి ప్రయాణికులు ఎయిర్ పోర్టులో పడిగాపులు కాస్తున్నారు. సమయం ముగుస్తున్నా తమను పట్టించుకోకపోవడంపై వారంతా మండిపడుతున్నారు. స్పైస్ జెట్ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, దీనిపై అధికారులు స్పందించకపోవడం గమనార్హం.