: ‘సుప్రీం’ సలహాను తిరస్కరించిన రాహుల్!
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ (ఆర్ఎస్ఎస్) పై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల కేసు సుప్రీంకోర్టులో ఈరోజు విచారణకు వచ్చింది. ఆర్ఎస్ఎస్ కు క్షమాపణలు చెబితే కేసు విచారణతో పని ఉండదని రాహుల్ కు సుప్రీంకోర్టు సలహా ఇచ్చింది. అయితే, ఈ సలహాను ఆయన తిరస్కరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్ఎస్ఎస్ కు క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదన్నారు. ఆ కేసులో వాదనకు తాను సిద్ధమేనంటూ రాహుల్ ఒప్పుకున్నారు. రాహుల్ గాంధీ తరపున సీనియర్ కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ వాదిస్తున్నారు. ఆయనే రాహుల్ తరపున కోర్టులో అభిప్రాయాన్ని వినిపించారు. వచ్చే ఫిబ్రవరిలో ఈ కేసు విచారణ జరగనుంది. కాగా, మహాత్మాగాంధీ హత్యకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘే కారణమంటూ గత ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. దీంతో ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన ఓ కార్యకర్త రాహుల్‌పై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.