: భారత్ నూ చుట్టేశారు... 173 పరుగులకు ఆలౌట్
నాగపూర్ లో భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న రెండవ టెస్టులో భారత జట్టు రెండవ ఇన్నింగ్స్ 173 పరుగులకు ముగిసింది. రెండవ ఇన్నింగ్స్ లో కేవలం 46.3 ఓవర్లలోనే భారత ఆటగాళ్లంతా పెవీలియన్ దారి పట్టారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా ముందు 310 పరుగుల విజయ లక్ష్యం ఉండగా, 'స్పిన్' హీరోగా మారిన పిచ్ పై ఇది అసాధ్యమైన లక్ష్యమేనని క్రీడా పండితులు భావిస్తున్నారు. ఆట ఇంకా మూడు రోజులకు పైగా మిగిలివుండగా, వరుణుడు అడ్డుపడితే తప్ప మ్యాచ్ డ్రా మాత్రం కాబోదు. మరికాసేపట్లో ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ కనీసం 15 ఓవర్ల పాటు సాగనుంది. ఇక ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా విజయం సాధించాలంటే కనీసం ఇద్దరు బ్యాట్స్ మెన్లు సెంచరీలతో విరుచుకుపడాల్సివుంది.