: చెన్నైలో ఘనంగా ‘పెద్ద పులి’ జయంతి... భారీ కటౌట్ ను ఏర్పాటు చేసిన వైగో


శ్రీలంకలో తమిళుల ఆధిపత్యం కోసం దశాబ్దాల తరబడి పోరాడి, శ్రీలంక సైన్యం చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఎల్టీటీఈ అధినేత, ‘పెద్ద పులి’గా ముద్రపడ్డ వేలుపిళ్లై ప్రభాకరన్ జయంతి సందర్భంగా తమినాడు రాజధాని చెన్నైలో ఘనంగా వేడుకలు జరిగాయి. ఎండిఎంకే చీఫ్ వైగో ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. 60 అడుగుల ఎత్తున ప్రభాకరన్ భారీ కటౌట్ ను ఏర్పాటు చేసిన వైగో, వేడుకలకు హాజరైన ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభాకరన్ ను తమిళుల ఆరాధ్య దైవంగా అభివర్ణించారు.

  • Loading...

More Telugu News