: సెకండ్ ఇన్నింగ్స్ లో టీమిండియా రెండు వికెట్లు డౌన్... నిలకడగా రాణిస్తున్న ధావన్
టీమిండియా స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు రాణించడంతో సఫారీ జట్టు బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కుప్పకూలింది. కేవలం 79 పరుగులకే ఆ జట్టు ఆలౌటైంది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్ లో 136 పరుగుల ఆధిక్యాన్ని సాధించిన టీమిండియా వెనువెంటనే తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే తొలి ఇన్నింగ్స్ కాస్త ఫరవాలేదనిపించిన ఓపెనర్ మురళీ విజయ్(5) రెండో ఇన్నింగ్స్ లో సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగాడు. మురళీతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన శిఖర్ ధావన్ (27) నిలకడగానే రాణిస్తున్నాడు. మురళీ ఔటవడంతో క్రీజులోకి వచ్చిన ఛటేశ్వర్ పుజారా(31) కొద్దిసేపు నిలదొక్కుకున్నట్టే కనిపించినా స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. అతడి స్థానంలో బరిలోకి దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (10) ధానవ్ కు చక్కటి సహకారం అందిస్తున్నాడు. 22 ఓవర్లు ముగిసేసరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. వెరసి సఫారీపై 217 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.