: ఎంపీగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన పసునూరి


వరంగల్ ఎంపీగా రికార్డు మెజారిటీతో విజయం సాధించిన టీఆర్ఎస్ నేత పసునూరి దయాకర్ కొద్దిసేపటి క్రితం లోక్ సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. తన మాతృభాష తెలుగులో ఆయన ప్రమాణ స్వీకారం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. రెండు రోజుల క్రితం ముగిసిన వరంగల్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో పసునూరి దయాకర్ 4.59 లక్షల భారీ మెజారిటీతో విజయం సాధించి తెలంగాణలో అత్యధిక మెజారిటీతో గెలిచిన అభ్యర్థిగా రికార్డులకెక్కారు. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా పసునూరి చేత లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రమాణం చేయించారు. రికార్డు మెజారిటీతో విజయం సాధించిన పసునూరి దయాకర్ ప్రమాణ స్వీకారాన్ని సభలోని అన్ని పార్టీల సభ్యులు ఆసక్తిగా తిలకించారు.

  • Loading...

More Telugu News