: పాక్-భారత్ టెస్టుల వేదిక ఇంగ్లండ్?


భారత్ -పాకిస్థాన్ జట్ల మధ్య వన్డే, టీట్వంటీ మ్యాచ్ లు శ్రీలంకలో నిర్వహించేందుకు బీసీసీఐ, పీసీబీ మధ్య ఒప్పందం కుదిరిన సంగతి విదితమే. ఈ మేరకు పీసీబీ ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ అనుమతి కోరినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంచితే, ఈ దేశాల మధ్య వచ్చే ఏడాది జరిగే టెస్టు మ్యాచ్ ల నిర్వహణకు ఇంగ్లండ్ సంసిద్దత తెలిపినట్టు వార్తలు వెలువడుతున్నాయి. అయితే, దీనిపై ఇంకా తుది నిర్ణయం జరగలేదని తెలుస్తోంది. దాయాది దేశాలైన పాకిస్థాన్ తో టీమిండియా ఆడడంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంటుంది. క్రికెట్ ప్రపంచంలో ఈ రెండు దేశాల మధ్య జరిగే మ్యాచ్ లు ఎంతో ఉత్కంఠను కలిగిస్తాయి. రికార్డులు నమోదు కాకున్నా రోమాంఛిత పోరాటాలు అభిమానులను అలరిస్తాయి. అసలైన క్రికెట్ మజా పంచేందుకు సిద్ధమవుతున్న సిరీస్ పై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.

  • Loading...

More Telugu News