: పారిస్ లో మరోసారి దాడులు జరిగి ఉండేవి
పారిస్ పై తీవ్రవాదులు విరుచుకుపడిన కొన్ని రోజులకే మళ్లీ దాడులు జరిగి ఉండేవని పారిస్ దాడులపై వాదన వినిపిస్తున్న ప్రాసిక్యూటర్ ఫ్రాన్సిస్కో మెలిస్ తెలిపారు. ఈ మేరకు బ్రహీం అబ్దెస్లామ్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడని ఆయన వెల్లడించారు. వారి దగ్గర దొరికిన ఆధారాల ప్రకారం పారిస్ లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో నవంబర్ 18న లేదా 19న దాడులకు దిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని ఆయన చెప్పారు. అయితే సెయింట్ డెనిస్ వద్ద భద్రతా దళాలు జరిపిన దాడుల్లో బ్రహీం అబ్దెస్లామ్ అతని సహచరులు మృతి చెందడంతో వారి ప్రయత్నం భగ్నమైందని ఆయన తెలిపారు. వారిని హతమార్చడం ద్వారా పారిస్ లో మరిన్ని దాడులు జరగకుండా అడ్డుకున్నారని ఆయన వెల్లడించారు.