: ఐఎస్ఐఎస్ ఆవిర్భావం ఎలా జరిగిందంటే...!
ఈ రోజు తన ఉగ్రవాదంతో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఐఎస్ఐఎస్ పుట్టుక విచిత్రంగా జరిగింది. సద్దాం హుస్సేన్ తో తమకు ముప్పు పొంచివుందన్న నెపంతో తన ఆధ్వర్యంలోని సంకీర్ణ సేనలతో యుద్ధానికి దిగి, విజయానంతరం అక్కడి సద్దాం అనుకూల సైనికులను బంధించేందుకు అమెరికా 'క్యాంప్ బుకా' అనే కారాగారాన్ని ఏర్పాటు చేసింది. దీని సామర్థ్యం లక్ష మంది. ఇందులో మాజీ సైనికులు, రాడికల్ భావాలు కలిగిన మత పెద్దలు, చిన్న నేరాలు చేసిన వారందరినీ ఉంచారు. దీంతో తీవ్రవాదులు, మత పెద్దలు, చిన్న నేరగాళ్ల మధ్య సఖ్యత ఏర్పడింది. ఇది ఐఎస్ఐఎస్ ఆవిర్భావానికి దారి తీసింది. ఐఎస్ఐఎస్ అధినేత అబు బకర్ బాగ్దాదీ ఇక్కడే శిక్ష అనుభవించారు. ఇక్కడ శిక్షననుభవించిన వారిలో ఎక్కువ మంది పాశ్చాత్య వ్యవహార శైలిని తీవ్రంగా వ్యతిరేకించేవారు. దీంతో జైలు మొత్తం అదేభావజాలం వ్యాప్తమైంది. దీంతో జైలు నుంచి విడుదలైన ప్రతి ఒక్కరూ ఐఎస్ఐఎస్ లో చురుగ్గా పాల్గొనడం ప్రారంభించారు. 2003లో ఏర్పాటు చేసిన క్యాంప్ బుకాను 2009లో మూసేసిన తరువాత ఐఎస్ తీవ్ర ప్రభావం చూపడం ప్రారంభించింది.